సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకు అయినా ఒక్క హిట్ పడితే చాలు దశ తిరిగిపోతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ హీరో పరిస్థితి కూడా ఇలాగే మారింది. ఆయనకు ఒక్క సినిమాతోనే ఫుల్ డిమాండ్ ఏర్పడుతోది. ఆయనే తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ఈ నటుడు ప్రస్తుతం హీరోగా మంచి జోష్ మీద ఉన్నాడు. తాను చేసిన మొదటి సినిమా జాంబిరెడ్డి మంచి హిట్ కావడంతో రెమ్యునరేషన్ పెంచేశాడు.
తేజ సజ్జాకు ఇప్పుడు యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన వరస మూవీలతో జోరుమీదున్నాడని చెప్పాలి. ఇక ఆయన మూడు పెద్ద మూవీలను లైన్లో పెట్టినట్టు సమాచారం. ఇంతకుముందు ఆయన చేసిన జాంబిరెడ్డి మూవీ సూపర్ హిట్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చింది.
దీంతో స్టార్ ప్రొడ్యూసర్లు కూడా ఆయన వద్దకు క్యూ కడుతున్నారు. ఇక ఇదే అదునుగా తేజ ప్రస్తుతం చేస్తున్న హను-మాన్ మూవీకి విపరీతంగా రెమ్యనరేషన్ పెంచేశాడంట. ఏకంగా రూ. కోటి వరకు రెమ్యూనరేషన్ పెంచడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్లు కూడా ఆయన రెమ్యనరేషన్కు ఓకే చెప్పేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తేజ మార్కెట్‌ను జాంబిరెడ్డి బాగానే పెంచేసిందని వారు కూడా ఓకే చెప్పుతున్నారు. అయితే తేజ అద్భుతం అనే సినిమాలో కూ నటిస్తున్నాడు. మొత్తానికి మనోడికి ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ వచ్చేసిందని తెలుస్తోంది. మరి మనోడు ఈ మార్కెట్‌ను కాపాడుకుండాలే లేదా అనిది మాత్రం ముందు ముందు వేచి చూడాలి.