టాలీవుడ్ అనేది ఎంతో మందికి జీవితాలను ప్రసాదించింది. ఎంతో మందిని స్టార్ హీరోలుగా చేసి వారిని ఆకాశానికి ఎత్తేసింది. అలాంటి ఇండస్ట్రీలో కొన్ని ఫ్యామిలీలు ఎంతగా ప్రభావం చూపుతున్నాయో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇక అందులో నందమూరి ఫ్యామిలీ అంటే మొదటి నుంచి ఆయువు పట్టులాగా ఉంది. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ హీరో మాత్రం తెలుగు తెరకు అనూహ్యంగా దూరమయ్యాడు.
ఆయనే కళ్యాణ్ కృష్ణ. ఈయన ఎవరో కాదు నందమూరి తారక రామారావు తమ్ముడు అయిన త్రివిక్రమ రావు కొడుకుగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అత్తగారు స్వాగతం మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో చేశారు. మరీ ముఖ్యంగా రౌడీ బాబాయ్ సినిమాతో పాటు ప్రేమ కిరీటం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీల్లో చేశారు.
కానీ ఆయన 2003లో విడుదలైన కబీర్ దాస్ మూవీ తర్వాత నటనకు దూరమయ్యారు. అందుకు పెద్ద కారణం కూడా ఉంది. ఓ రోడ్డు ప్రమాదంలో తన కొడుకు పృథ్వీని, తమ్ముడుని కోల్పోయారు. అదే ప్రమాదంలో తన తండ్రికి కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇక దాతో ఆయన షాక్‌లోకి వెళ్లి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టిందంట. అందుకే ఆయన సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోనే ఉంటూ తన బిజినెస్‌లను చూసుకుంటున్నారు. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లోనే స్థిరపడినా కూడా తన తండ్రితో పాటు కళ్యాణ్ చక్రవర్తి మాత్రం చెన్నైలోనే నివాసం ఉంటున్నారు.