సినీ ఇండస్ర్టీలో ఎప్పటికీ ఏదో ఒక ఆంశం వివాదం అవుతూనే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు తమను ఇండస్ర్టీలో చాలా మంది లైంగికంగా వేధించారంటూ… అనేక మంది తారలు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. మీటూ అంటూ ఒక ఉద్యమాన్నే నిర్మించారు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా హాలీవుడ్ నుంచి కూడా నటీమణులు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. తాము కూడా ఇండస్ర్టీలో అనేక లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని ఓపెన్ అయ్యారు.
అయితే ఇన్నాళ్లకు మీటూ సెగలు కాస్త తగ్గి ప్రశాంత వాతావరణంలోకి రాకముందే ఇండస్ర్టీలో మరో వివాదం రేగింది. చిత్ర పరిశ్రమలో పారితోషకం విషయంలో ఆడవాళ్లను తక్కువగా చూస్తున్నారని పలువురు నటీమణులు ఆరోపించారు. హీరోలతో పోలిస్తే… హీరోయిన్లకు లేడీ ఆర్టిస్టులకు తక్కువగా పేమెంట్ చేస్తారని మండిపడుతున్నారు. ఈ ఆరోపణలకు తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా మద్దతు పలకడం విశేషం. ఆమె తాజాగా… ఓ ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడుతూ… సంచలన ఆరోపణలు చేశారు. పే గ్యాప్ విషయం వాస్తవమేనని అంగీకరించారు. ఎన్నటి నుంచో ఈ తేడా ఇండస్ర్టీలో ఉందని చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులకు సినిమాల్లో అమ్మాయిల పాత్రలను చూపించే విధానంలో మార్పులు జరిగాయి కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పాత పద్ధతులనే అనుసరిస్తున్నారని ఆరోపించింది. తాను కూడా ఇలాంటివి ఎదుర్కొన్నాని తెలిపింది.
తెలుగుతో సినీ కెరీర్ ఆరంభించి… ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న మరో హీరోయిన్ తాప్సీ కూడా ఈ వివాదంపై మాట్లాడింది. ఈ అమ్మడు మరిన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. తనతో పాటు ఇండస్ర్టీలోకి వచ్చిన హీరోలు తనకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారని తెలిపింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్టవుతున్నా కూడా తమకు రెమ్యునరేషన్ పెరగడం లేదని వాపోయింది.