బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ మూవీ తలైవి గరించి ప్రస్తుతం ఒక ఇంట్రస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. జయ లలిత జీవిత గాధకు దాదాపు 150 కోట్ల బడ్జెట్ అవుతుందట. ఈ మూవీని దర్శకుడు ఏ. ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, కొన్ని స్టిల్స్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిది. ఈ విషయంతో మూవీ మేకర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సీనియర్ నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నాడు. కంగనా రనౌత్ అరవింద్ స్వామి కలిసి ఉన్న స్టిల్స్ కు తెగ రెస్పాన్స్ వచ్చింది.
కానీ 150 కోట్లు బడ్జెట్ అనే సరికి అందరూ గుండెలు పట్టుకుంటున్నారట. ఈ మూవీలో జయలలిత పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ ముద్దు గుమ్మ కంగనాకు హిందీ చిత్ర సీమలో మంచి మార్కెట్ ఉండడం ఈ మూవీకి ప్లస్ అవుతుందని కొందరు భావిస్తున్నారు. అంతే కాకుండా తమిళ తంబీలకు జయలలిత అంటే ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మూవీకి 150 కోట్ల మార్కను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా మూవీని గ్రాండ్ గా నిర్మించారట. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. మరో విషయమేంటంటే ఈ మూవీలో అమ్మ జయలలిత 18 సంవత్సరాల నాటి సీన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సీన్లలో అందాల అమ్మడు కంగనా రనౌత్ ఇరగదీసిందట. తెలుగులో ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ ప్రభాస్ సరసన ఓ మూవీ చేసింది.