టాలీవుడ్ ముద్దుగుమ్మ, అభిమానులు మద్దుగా హనీ అని పిలుచుకునే మెహ్రీన్ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ అమ్మడు నిర్ణయంతో యావత్ సినీ ప్రేక్షకులు, ఇండస్ర్టీ పెద్దలు కూడా కంగుతిన్నారు. మెహ్రీన్ కు నాలుగు నెలల క్రితం రాజకీయ నాయకుడి వారసుడు, మాజీ ముఖ్యమంత్రి మనువడైన భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ తాజాగా 4 నెలల తర్వాత ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. తన నిశ్చితార్థం రద్దు విషయాన్ని ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతే కాకుండా ఈ విషయంపై తాను ఇంకా ఎప్పటికీ మాట్లాడాలనుకోవడం లేదని తెలిపింది. భవ్య బిష్ణోయ్ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది.
దీనిపై వరుడు భవ్య బిష్ణోయ్ కూడా తాజాగా స్పందించారు. ఆయన కూడా మెహ్రీన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ విషయంలో ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అందాల ముద్దు గుమ్మ మెహ్రీన్ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. మెహ్రీన్ కుటుంభ సభ్యులను పొగడ్తలతో ముంచెత్తారు. మెహ్రీన్ తనకు ఎప్పటికీ గొప్ప స్నేహితురాలిగా ఉంటుందని తెలిపారు.
కాగా వీరి నిశ్చితార్థం లాక్ డౌన్ సమయంలో జైపూర్ లో కొద్ది మంది అతిథులు సమక్షంలో నిర్వహించారు. కరోనా కారణంగా పెళ్లి ఇన్నాళ్లు చేసుకోలేదు. అయితే తాజాగా ఇప్పుడు నటి మెహ్రీన్ పూర్తిగా నిశ్చితార్థాన్నే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. మెహ్రీన్ ప్రస్తుతం టాలీవుడ్ లో F2 స్వీకెల్ మూవీ F3తో పాటు మరో యువ హీరో సంతోష్ శోభన్ తో కలిసి మూవీలో కూడా నటిస్తోంది.