ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ మొదటి నుంచి సెపరేటు ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాడు. ఎవరు చేయని ప్రయోగాలు చేస్తూ తనదైన స్టైల్‌ను ఫ్యాన్స్ కు రుచి చూపిస్తున్నాడు. ఇక ఇప్పుడు సౌత్‌లోనే స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్‌తో కలిసి ప్యాన్ ఇండియా మూవీ లైగర్‌లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు కరోనాతో కాస్త బ్రేక్ తీసుకుని ఇంట్లోనే ఉంటున్న విజయ్ దేవరకొండ.. ఆయన న్యూ లుక్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు.
ఆయన తన కొత్తలుక్‌ను పరిచయం చేస్తూ దిగిన ఓ ఫొటో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇస్తున్న ఈ మాస్ స్టార్.. సోషల్ మీడియాలో మిగతా హీరోల కంటే ఎక్కువగానే ఫాలోయింగ్ సంపాదించాడు. అయితే విజయ్ కొత్త లుక్‌లో దిగిన పొటోలో బుల్లెట్ బైక్ దగ్గర కూర్చొని భారీగా పెంచేసిన కండలతో, పొడవాటి జుంపాలతో సేమ్ టు సేమ్ హృతిక్ రోషన్లాగే ఉన్నాడు.
ఎందుకంటే ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి హృతిక్లాగే కండలు, హెయిర్ స్టైల్‌ను మెయింటేన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతైనా బాలీవుడ్లో ఇప్పుడు కండలు, ఫిజిక్ ఉన్న హీరోలకు క్రేజ్ చాలా ఉంది కాబట్టి విజయ్ ఈ విధంగా తయారయ్యాడని తెలుస్తోంది. ఇక దీనికి ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఐయామ్ రెడీ ఫర్ యూ అంటే చెప్పడం ఇంకా ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్ వైరల్ గా మారుతోంది. ఈ ఫొటోను చూసిన విజయ్ అభిమానులు లక్షల్లో లైక్స్ తోపాటే వేలల్లో కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు.