ప్రతి వాడికి సెలబ్రెటీలను విమర్శించి సెలబ్రెటీ అవ్వాలనే కోరిక. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నట్లుగా ఎప్పుడు ఏదో ఒక వివాదంను రాజేసి పబ్బం గడుపుకునే ఒక వర్గం వెబ్ మీడియా ఉంది. వారు ఎప్పుడు కూడా హీరోలపై నెగటివిటీతో కూడిన వార్తలు రాస్తూ ఉంటారు. సినిమా పరిశ్రమ మీద ఆదారపడి పబ్బం గడుపుకుంటున్న ఎన్నో వెబ్ మీడియా సంస్థలు కూడా ఏదైనా ఇష్యూ తెరపైకి వచ్చిన వెంటనే టాలీవుడ్ ను ఏకి పారేసేందుకు ముందుకు వస్తుంది. ఈమద్య కాలంలో కరోనా వల్ల ఇండస్ట్రీ చాలా నష్టాలను చవిచూస్తుంది. అదేం వారికి పట్టదు. కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఉన్న నిర్మాతలు ఏం చేయాలో దిక్కు తోచక ఉన్నారు.
ఈ రెండేళ్ల కాలంలో స్టార్ హీరోలు పదుల కోట్ల ఆదాయంను కోల్పోయారు. చిన్న హీరోలు కోట్లలో ఆదాయం కోల్పోయారు. ఇక సినీ కార్మికులు కూడా కనీసం తిండికి కూడా నోచుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సినీ కార్మికుల కోసం ఎంతో మంది స్టార్ హీరోలు విరాళంను ప్రకటించారు. కోట్లలో విరాళాలు సేకరించి వేలాది మంది సినీ కార్మికులకు అన్నం పెట్టిన ఘనత సినీ ప్రముఖులదే. భూకంపం.. తుఫాన్.. మరే విపత్తు వచ్చినా కూడా ఇండస్ట్రీ వర్గాల వారు ముందుండి సాయం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే చలించి పోయిన చిరంజీవి దాదాపు 30 ఏళ్ల క్రితమే వారి కుటుంబాలకు సాయం చేసిన ఘనత మన ఇండస్ట్రీ ప్రముఖులకు ఉంది.
దివిసీమ ఉప్పెన సమయంలో సినీ ప్రముఖులు సాయం చేయడంతో పాటు రోడ్ల మీద తిరిగి విరాళాలు సేకరించారు. ఇంకా ఎన్నో చారిటీ కార్యక్రమాలకు క్రికెట్ కబడ్డి వంటి ఆటలు ఆడి వచ్చిన డబ్బును ప్రభుత్వంకు అందజేశారు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ లు తెలియకుండా ఎంతో మందికి వేలు లక్షల్లో సాయం చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ ఏయన్నార్ నుండి మొదలుకుని ఇప్పటి స్టార్స్ ప్రభాస్, చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా అందరు స్టార్ హీరోలు తమ స్థాయికి తగ్గట్లుగా ఏదో ఒక సమయంలో తమ దాతృత్వం చాటుకున్నారు.
ఏదైనా కష్టం రాగానే తమ ఆస్తులు మొత్తం ఇచ్చేస్తే అప్పుడు సినీ ప్రముఖులు గొప్పవారు అవుతారా.. సినీ ప్రముఖులు సంపాదించిన డబ్బు ఈజీగా వచ్చిందా.. వారు ఏమైనా దొంగతనం దోపిడీలు చేసి సంపాదించారా.. ఒక్క సినిమా ను చేసేందుకు వారు ఎంతగా కష్టపడతారో వారికే తెలుసు. బాహుబలి అంత సక్సెస్ అయ్యిందంటే ప్రభాస్ దాదాపు అయిదు సంవత్సరాలు ఒల్లు హూనం చేసుకుని మరీ కష్టపడ్డాడు. అలాంటప్పుడు ఆయనకు వచ్చిన పేరు మరియు డబ్బు ఈజీగా వచ్చిందని మీరు ఎలా అంటారు.
హీరోలు మాత్రమే కాదు దర్శకులు నిర్మాతలు ప్రతి సినిమా కోసం తమ సర్వస్వంను పెడతారు. వారు జీవితాలను పనంగా పెట్టి మరీ సినిమాలను చేస్తారు. ఎక్కువ సార్లు నష్టపోతారు. కొన్ని సార్లు మాత్రమే లాభాలు వస్తాయి. అంత కష్టపడ్డ సొమ్మును తమ వారికి లేకుండా ఎవరైనా ఎలా ఇస్తారు. స్థాయికి తగ్గట్లుగా విరాళం ఇస్తారు. కాని తాహతకు మించి సేవా కార్యక్రమాలు చేయాలని ఎలా అంటారు. సోనూసూద్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.. చిరంజీవి ఏం చేస్తున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు.. చిరంజీవి గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలిసిన బుద్ది ఉన్న గాడిద ఎవరు కూడా ఈ ప్రశ్న వేయడు.
తన ఫ్యాన్స్ సహకారంతో ఐబ్యాక్.. బ్లడ్ బ్యాంక్ మొదలుకుని ఎన్నో సేవా కార్యక్రమాలను చిరంజీవి చేస్తున్నారు. మొన్నటికి మొన్న టీఎన్నార్ చనిపోతే లక్ష సాయం చేశారు.. పావల శ్యామల ఆర్థిక సమస్యలు తెలుసుకుని సాయం అందించారు. అన్ని కోట్లు ఉన్న వ్యక్తి లక్షల్లో సాయం చేయడం ఏంటీ అంటూ మరో గాడిద వాగుతున్నాడు. చిరంజీవి స్థాయికి ఆ మొత్తం చిన్నదని వాగే వాడు వందల కోట్ల ఆస్తులు ఉన్న రాజకీయ నాయకుడి వద్దకు లేదా వ్యాపారవేత్త సాయం చేయడం లేదేం అని ఎప్పుడైనా ప్రశ్నించడా.. కాసిన చెట్లకే రాళ్లదెబ్బలు అన్నట్లుగా సాయం చేసే వారినే ఎందుకు విమర్శించడం. ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా తమకు సాధ్యం అయినంత వరకు సాయం చేస్తూనే ఉన్నారు.
సాయం చేయడం లేదు అంటే వారే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని అర్థం. అలాంటి వారికి ఏమైనా నువ్వు సాయంగా నిలుస్తావా.. రాజకీయ నాయకులను విరాళాలు ఇవ్వండి.. ఆ పనులు చేయండి ఈ పనులు చేయండి అంటూ అడిగే దమ్ము ధైర్యం లేని రాజకీయ జర్నలిస్టులారా మీకు సినీ ప్రముఖులు ఇస్తున్న విరాళాలు మరియు వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. కొందరికి కనీసం వారి పేరును కూడా ఎత్తే అర్హత లేదు. అలాంటిది మీరు దేవుళ్ల లాంటి సినీ ప్రముఖులను విమర్శిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. అన్ని ఆ దేవుడు.. దేవుళ్ల వంటి ప్రేక్షకుల దేవుళ్లు చూస్తున్నారు.
Ramesh.P