టాలీవుడ్ లోకి చాలా మంది హీరోయిన్స్ ఎక్కువగా నార్త్ నుండి వస్తు ఉంటారు. వారికి ఇక్కడ ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఇప్పటి వరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నార్త్ అమ్మాయిలు తెలుగు సినిమాలో ఓ వెలుగు వెలుగుతున్నారు. తెలుగు మాట్లాడటం రాకపోయిన అందం, అభినయం, ఆకర్షణ లతో ఇక్కడ రానిస్తున్నారు.
తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఒక్కరు ఇద్దరు తప్ప ఎక్కడ కనిపించరు. వీరికి డిమాండ్ బాగా తక్కువగా ఉంటుంది. సినిమాలో ఛాన్స్ లు వచ్చిన ఓ ఐటెమ్ సాంగ్ గా, లేక ఫ్రెండ్ లవర్ గానో లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో ఛాన్స్ లు వస్తాయి తప్ప మెయిన్ లీడ్ పాత్రలు తెలుగు హీరోయిన్స్ కు చాలా తక్కువ.
హైదరాబాద్ కు చెందిన డింపుల్ హయతి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన డింపుల్ కు తెలుగు సినిమాలో అవకాశాలు మాత్రం రావడం లేదు. హీరోయిన్ కు ఉండాలిసిన అన్నీ మెటీరియల్స్ ఉన్న డింపుల్ కు సరైన సినిమా మాత్రం పడటం లేదు. గల్ఫ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించింది. అవి నిరాశ పరచడంతో హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేశ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.
ఆ చిత్రం విజయంతో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ లో ఆమెకు ఓ ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా ఓ చిన్న క్యారెక్టర్ అని సమాచారం. పాత్ర చిన్నది అయిన రాజమౌళి సినిమా కావున ఆమెకు సరైన గుర్తింపు దక్కుతుందని నమ్మకంతో ఉంది. అలాగే రమేశ్ వర్మ దర్శకత్వంలో రవి తేజ హీరోగా ఖిలాడి అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. హీరోయిన్ గా అవకాశం రావడంతో ఈ సినిమాపై డింపుల్ హయతి చాలా హోప్స్ పెట్టుకుంది.
రవి తేజ సినిమా అంటే హిట్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ లేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద చెత్త రికార్డ్స్ ఇది మనకు తెలిసిన విషయమే డింపుల్ కెరీర్ రవి తేజ ఖిలాడి సినిమాపై ఆదారపడి ఉంది.