తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాను తెలుగు లో రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓ ప్రముఖ నిర్మాత ఆ రీమేక్ రైట్స్ ను దక్కించునే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. తమిళం విక్రమ్ వేద సినిమాలో మాధవన్ మరియు విజయ్ సేతుపతి లు కలిసి నటించారు. పోలీసు పాత్రలో మాధవన్ నటించగా, గ్యాంగ్ స్టార్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు.
ఈ చిత్రం తెలుగు రీమేక్ లో చిరంజీవి, నాగార్జున కలిసి నటించబోతున్నారు అని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ వార్తా తెగ వైరల్ అవ్వుతుంది. వీరిద్దరు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలు, మరి వీరు కలిసి నటిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ అవ్వడం ఖాయం. ఈ వార్తా నిజం కావాలని మెగా మరియు అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. చిరంజీవి ఇప్పటివరకు సోలో సినిమాలు మాత్రమే చేశాడు. కమర్షల్ గా మల్టీ స్టారర్ సినిమాలు చేయలేదు. నాగార్జున కూడా మల్టీస్టారర్ గా చేసిన సినిమాలు తక్కువనే. మోహన్ బాబు తో ఆదిపతి, నాని తో దేవదాస్, కొడుకు చైతన్య తో మనం ఇలా ఏవో కొన్ని సినిమాలు మాత్రమే చేశాడు.
చిరంజీవి మరియు నాగార్జున కలిసి నటిస్తే చూడాలని అభిమానులనుండి సగటు ప్రేక్షకుడు వరకు ఉంటుందనే చెప్పాలి. మరి ఈ విషయంపై త్వరలో ఓ అధికారిక ప్రకటన రానున్నది. విక్రమ్ వేద బాలీవుడ్ లో కూడా రీమేక్ త్వరలో అవ్వనున్నది. అక్కడ ఈ చిత్రంలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లు నటించనున్నారు. నాగ్ ఈ ఏడాది వైల్డ్ డాగ్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు.