నాగార్జున సూపర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఓ దశాబ్ద కాలం పాటు ఇండస్ష్ట్రి ని తన సినిమాలతో ఓ ఊపు ఊపింది. ఇప్పటికే అనుష్క తో పాటుగా సినిమాలోకి వచ్చిన హీరోయిన్స్ ఒక్కొక్కరిగా పెళ్లిలు చేసుకుంటున్నారు. కానీ అనుష్క మాత్రం తాన పెళ్లి ఎప్పుడు అనే విషయం మాత్రం చెప్పడం లేదు. ఆమె అభిమానులు బాహుబలి సినిమా తర్వాత అనుష్క పెళ్లి అవ్వుతుంది అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకోకుండా నిశబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం నిరాశ పరచడంతో సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆలోచనతో అడుగులు వేస్తుంది. జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా ఓ సినిమాలో నటించేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ చిత్రం ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు.ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి మరికొంత సమయం పట్టేలాగా ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా విజృంబిస్తున్న క్రమంలో సినిమా షూటింగ్ లు పోస్ట్ పోన్ అవ్వుతున్నాయి. ఈలోగా ఆమె కుటుంబ సభ్యులు అనుష్క కు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.
తాజా సమాచారం మేరకు దుబాయ్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తను అనుష్క పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. కాకపోతే అతను అనుష్క కంటే ఏజ్ లో చిన్నవాడని సమాచారం. మరి ఈ సబందమైన నిజమా లేక మరో పుకారు లాంటిదా అనే విషయం తెలియాలి అంటే అనుష్క నుండి కాని వారి ఫ్యామిలి నుండి అధికారిక ప్రకటన రావాలిసిందే. అనుష్క ప్రస్తుతం సినిమాలు ఏవి చేయకుండా ఖాళీగానే ఉంది.