అక్కినేని వారి కోడలు సమంత కరోనా సమాయలో ప్రజలకు అవసరమైన సలహాలు సూచనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. సరైన మందులు మరియు అక్సిజన్ కొరతతో తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
కరోనా ను ధైర్యంగా ఎదురుకోవాలి అంటే ఆశ, పాజిటివిటి అనేది ఉంటే చాలు కరోనాను ధైర్యంగా ఎదురుకోవచ్చు అని సమంత ప్రజలకు సూచనలు చేసింది. ఇప్పటికే సినిమా ఇండస్ష్ట్రి కి చెందిన కొంత మంది ప్రముఖులు కరోనా భారీన పడి తిరిగి కోలుకోగా మరికొంత మంది మాత్రం ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో సెలబ్రేటీలు తమ వంతు సాయం మరియు, సూచనలు, సలహాలు సోషల్ మీడియా వేధిక గా చేస్తున్నారు.
అక్కినేని సమంత సినిమాల విషయానికి వస్తే… నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్నా తర్వాత సినిమాలు చాలా తగ్గించింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్దంగా ఉంది