రామ్ పోతినేని తనదైన స్టైల్ లో విభిన్నమైన సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు రామ్ సినిమాలు యావరేజ్ గా, పర్వాలేదు అనిపించుకునే విధంగా ఉండేవి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ లైఫే టర్న్ అయ్యిందని చెప్పాలి. మాస్ సినిమాలు అంటే ఇష్టపడే ప్రేక్షకులు మొత్తం రామ్ అంటే విపరీతమైన అభిమానం పెంచుకున్నారు.
ఇస్మార్ట్ చిత్రానికి ముందు చాక్లెట్ బాయ్ లాగా ఉండే రామ్ ఇస్మార్ట్ తర్వాత మాస్ హీరోగా మారిపోయాడు. ఇక రామ్ నటించిన లాస్ట్ చిత్రం రెడ్. ఈ చిత్రం యావరేజ్ హిట్ ను సొంతం చేసుకున్నా రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం తర్వాత రామ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ లోగా కరోనా స్టార్ట్ అయింది. దాంతో మరో సినిమా మొదలు అవ్వడానికి మరికొంత సమయం పట్టింది. ఇటీవల తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇక ఈ చిత్రం పట్టలేక్కబోతుంది అనే లోగా కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్ లు అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి.
తమిళ దర్శకుడు లింగు స్వామి తెలుగు లో దర్శకత్వం వహిస్తున్న మొదటి చిత్రం ఇది. రామ్ పక్కన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో సినిమాను అనౌన్స్ చేశాడు. మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను త్వరలో తీసుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా చెక్ మూవీ హీరోయిన్ ప్రియా ప్రకాష్ ను తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. తెలుగు లో ప్రియా ప్రకాష్ వారియర్ వరస సినిమాలను లైన్లో పెడుతుంది. తెజ్జ సజ్జా హీరోగా ఇష్క్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.