యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టి సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసిన చాలా మంది టాలీవుడ్ యాంకర్స్ లలో శ్యామల ఒక్కరు. బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఓ వైపు టివి రంగంలోను రానిస్తూ మరో వైపు సినిమాల్లోను తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు యాంకర్ శ్యామల అంటే ఇండస్ష్ట్రి లో తెలియని వారు అంటే ఎవరు ఉండరు. ఇక ఆమె భర్త నరసింహ ఎలక్షన్స్ సమయంలో వైఎస్ఆర్సిపి తరుపున ప్రచారం చేస్తుంటే తాను కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి భర్తకు సఫోర్ట్ గా నిలిచింది.
అయితే ఆమె తాజా ఇంటర్వ్యూ లో తాను సినిమా ఇండస్ష్ట్రి ఫీల్డ్ లోకి ఏ విధంగా వచ్చాను ఎంత స్ట్రగుల్ అనుభవించాను. అలాగే తాను ప్రేమించిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంది ఇలా ప్రతి విషయాన్ని ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది. యాంకర్ శ్యామల టివి సీరియల్ నటుడు నరసింహను పెళ్లి చేసుకున్నా సంగతి అందరికి తెలిసిందే. అయితే తమకు పరిచయం ఎలా అయ్యింది అనే విషయమై.. మొదటిసారి నరసింహా ను ఓ సీరియల్ షూటింగ్ లో చూశాను. ఆయన అప్పటికే స్టార్ డమ్ వచ్చిన వ్యక్తి. అతను ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకొని వెళ్లిపోయేవాడు.
ఆలాంటి వ్యక్తి తో నేనే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడను. అల కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత తానే స్వయంగా నన్ను మా ఇంటి వద్ద డ్రాప్ చేసేవాడు. అల మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత మా విషయాన్ని మా అమ్మతో చెప్పాను. మా అమ్మ నరసింహా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలి అంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ యూఎస్ లో ఉన్నారు. మా తరుపు బందువులు మాత్రం వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితేనే మీ పెళ్లి అని అన్నారు. ఆ తర్వాత ఓసారి షూటింగులో నేను వెళ్ళి నరసింహా తో మాట్లాడుతుంటే మా అమ్మ చూసి అక్కడే నా చెంప పైన లాగి పెట్టి ఓ దెబ్బ కొట్టిందని యాంకర్ శ్యామల అన్నారు.
ఆ తర్వాత మా అమ్మ నన్ను వదిలి మా సొంత ఉరుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత నేను హరి తేజ ఫోన్ తో నరసింహా కు కాల్ చేసి అసలు విషయం చెప్పాను. నేను మేజర్ అయ్యే వరకు వాళ్ళ అక్క ఇంట్లో ఉంచి ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాడని శ్యామల పేర్కొంది.