నటి ఇంద్రజ విజవవాడ లో పుట్టి. ప్రస్తుతం చెన్నయ్ లో ఉంటుంది. ఆమె మోడల్ గా కెరీర్ ను ప్రారంబించి హీరోయిన్ గా సెట్టిల్ అయింది. ఆమె మొట్ట మొదటగా ఓ తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో చేసింది చాలా తక్కువ సినిమాలు. తెలుగు, మలయాళ, కన్నడ బాషల్లో చాలా చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత చాలాకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఈ మధ్యనే తిరిగి మరల సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది.
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. అలాగే బుల్లి తెరపై జబర్దస్త్ షో కు జడ్జ్ గా కొనసాగుతుంది. రోజా హెల్త్ పరంగా జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు. ఇక సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది. కానీ ఇంద్రజ మాత్రం వెళ్ళలేదు. అంత మంచి అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయ్యి చాలా మంది సినిమాల్లో టివి షో లలో రానిస్తున్నారు. అలాంటి ఇంద్రజ ఎందుకు బిగ్ బాస్ షోకు వెళ్ళలేదు అనే విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూ లో క్లారిటి ఇచ్చింది.
మా ఫ్యామిలీ వచ్చి చెన్నై లో ఉంటుంది. అందుకే వాళ్ళను విడిచి అన్నీ రోజులు ఉండలేక బిగ్ బాస్ ను రిజక్ట్ చేశాను. మరల ఛాన్స్ వస్తే ఎంట్రీ ఇస్తారా హౌస్ లోకి అంటే.. వెళ్లను అని చెప్పారు. కాకపోతే గెస్ట్ గా వెళ్లమంటే వెళ్తాను. అది కూడా నాగార్జున గారిని చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి వెళ్తాను అని ఇంద్రజ సమదానం ఇచ్చింది. నాగ్ సర్ తో హలో బ్రదర్ లో ఓ సాంగ్ చేశాను. ఆయన తో పనిచేసిన అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు.