నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రూపొందనున్నది అనే సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎప్పుడు పట్టలేక్కబోతుంది అంటే… ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో అఖండ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య బాబు మొత్తం మూడు పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఓ పాత్రను బాలయ్య బాబు బర్త్ డే రోజున విడుదల చేశారు.
ఆ పాత్రలో బాలయ్య చల్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఇప్పటికే 34 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. మిగతా రెండు పాత్రల్లో ఒక్కటి లాయర్ గా మరొక్కటి పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం తర్వాత క్రాక్ తో హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు.
ఆ తర్వాత అనీల్ రావిపూడి తో చిత్రం ఉండనున్నది. నిజానికి బాలకృష్ణ వందవ చిత్రాన్ని అనీల్ రావిపూడి చెయ్యాలిసింది. బాలయ్య బాబు కు ఎన్టిఆర్ టైటిల్ తో కూడిన ఓ కథను కూడా వినిపించాడు. కానీ ఆ కథ లో మార్పులు చేర్పులు ఉంటే బాగుంటుంది అని భావించి బాలయ్య బాబు చేయలేదు. కానీ ఇప్పుడు అనీల్ మరల అదే కథ కాని బాలయ్యబాబు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లోని సినిమా టైటిల్ కూడా “రామారావు గారు” అని పెట్టి సినిమాపై అంచనాలను తీసుకువచ్చాడు.
మరి ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించనున్నారు. ఇక వీరి కాంబినేషన్స్ లో సినిమా గురించి త్వరలో అఫిషియల్ ప్రకటన రానున్నది. ప్రస్తుతం అనీల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రంతో బిజీగా ఉన్నాడు.