యాంకర్ అనసూయ బుల్లి తెరపై మరియు సినిమా తెరపై ఓ వెలుగు వెలుగుతున్న నటీమణి. జబర్దస్త్ షో తో కుర్రకారును మొత్తం తన వైపుకు తిప్పుకుంది. హాట్ హాట్ స్టేపులతో గ్లామరస్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక్క టివి తెరపైనే కాకుండా సినిమాలలో కీలక పాత్రలు చేస్తుంది. అడివి శేషు హీరోగా నటించిన క్షణం చిత్రంలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ చేస్తుంది. అలాగే ఖాళీ సమయంలో తన హాట్ హాట్ ఫోటోలను, వీడియో లను ఇంస్తాలో షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే అమ్మడికి అక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరి పిల్లలకు తల్లి అయిన తరగని అందంతో యూత్ కు సెగలు పుట్టిస్తుంది. కరోనా సమయంలోనూ ఆమె ఫోటోలు విపరీతంగా వైరల్ అవ్వుతున్నాయి. ఈ ఫోటోలపై తాజాగా ఓ నెటిజన్ అనసూయను ట్రోల్ చేస్తూ దేశం మొత్తం కరోనా వ్యాపించి మరణాలు కేసులు ఎక్కువ అవ్వుతుంటే నీకు ఇలాంటి ఫోటోలు అవసరమా…
కరోనా నివారణ కోసం ప్రజల్లో అవగాహన లాంటివి ఏవైనా చెయ్యవచ్చుగా.. మీకు అసలు అలాంటి బాద ఉందా లేదా అని ప్రశ్నించగా.. అందుకు అనసూయ ఆ నెటిజన్ కు కౌంటర్ ఇస్తూ… నువ్వు పాజిటివ్ కోణంలో ఆలోచించలేవా ఎందుకు నెగటివ్ థింకింగ్.. అసలు ఇలాంటి కఠినసమయాల్లో కూడా ఎంటర్ టైన్మెంట్ పై నమ్మకాని కలిగిస్తున్నాం అంటూ కౌంటర్ ఇచ్చింది. అనసూయ కు ఇలాంటివి కొత్తేమి కాదు గతంలో ఇంతకంటే దారుణమైన ట్రోల్స్ కు గురైంది. అనసూయ సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాటుగా రవితేజ ఖిలాడి చిత్రంలో కూడా నటిస్తుంది.