సినిమా రంగుల ప్రపంచంలో తాము కూడా ఓ స్టార్ లాగా మెరిసిపోవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అందులో కొంత మంది బయట ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న, వాటితో వారు సాటిస్ ఫై అవ్వరు తమకు కావాల్సింది ఇది కాదు మరోటి ఉందని ఆశ పెంచుకుంటారు. అల ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు హీరోలు మన తెలుగు సినిమా ఇండస్ష్ట్రి లో ఉన్నారు. కామిడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం కూడా ఒక్కప్పుడు టీచరే. సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ష్ట్రి లోకి అడుగు పెట్టాడు.
కోట శ్రీనివాస్ రావు బ్యాంక్ ఉద్యోగం వదిలేసి సినిమాలోకి వచ్చాడు. ఇల ఒక్కరా ఇద్దరా ఎంతో మంది ఉన్నారు. తాజాగా మరో యువ కామిడి నటుడు కూడా వచ్చి ఈ లిస్ట్ లో చేరాడు. ఇంతకు అతను ఎవరు అనుకుంటున్నారా. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై పేరును సంపాదించుకుంటున్న నూక రాజు. అవును అతను కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగినే. చేస్తున్న జాబ్ ను వదిలేసి సినిమా లో కనిపించాలనే కోరికతో ఇండస్ష్ట్రి లోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. విజయవాడ పవర్ ప్లాంట్ లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయితే మొదట్లో ఉద్యోగం చేస్తూ అవకాశాల కోసం వెతకడం మొదలు పెట్టాడు.
అసమయంలో పటాస్ లో ఛాన్స్ వచ్చింది. ఒక్కో కామిడి స్కిట్ చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. అయితే ఓ వైపు జాబ్ చేస్తూనే మరోవైపు స్కిట్స్ చేసేవాడు. ఉద్యోగం వలన తాను ఎంతగానో ఇష్టపడే నటనకు ఆటంకం కలుగుతుండటంతో జాబ్ ను వదిలేశాడు. ఇక పటాస్ ప్రోగ్రాం తో నూక రాజుకు మంచి నేమ్ వచ్చింది. ఆ తర్వాత నాగబాబు అదిరింది, బొమ్మ అదిరింది షో లకు స్కిట్స్ చేశాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో జీవన్ టీమ్ లో చేస్తున్నాడు. తనకు ఇష్టమైన సినిమా రంగం కోసం జాబ్ ను వదిలేసిన నూక రాజుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.