సినిమాల్లో కనిపించాలనేది చాలా మందికి ఉంటుంది. అందులో కొంతమంది మాత్రమే తమ కలను సాకారం చేసుకుంటారు. అందులో మన కమెడియన్ జబర్దస్త్ హరిత ఒక్కరు. హరిత ఎవరు అనుకుంటున్నారా. అదే అంది లేడి గెటప్ లు వేసే హరి. తాజాగా ఆయన తన జీవితంలోని కొన్ని సంఘటనలను మరోకొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.
జబర్దస్త్ షో కు రాక ముందు కూడా నేను ఓ చిన్నపాటి సెలబ్రేటినే . మా ఊరిలో నాటకాలకు లేడి గెటప్ లు వేసేవాడిని. నాకు నటన అంటే చిన్నతనం నుండి చాలా ఇష్టం. ఎలాగానే సినిమాలోకి రావాలనేది నా కోరిక అని అన్నాడు. అయితే నేను వేసే లేడి గెటప్ చూసి చాలా మంది అబ్బాయిలు నాకు ప్రపోస్ చేశారు. వారిని చూస్తే నాకు నవ్వు వచ్చేది. ఎందుకు అంటే నన్ను చూసి అమ్మాయి అనుకునే వారు. జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు అని తెలిసి జబర్దస్త్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాను.
ఆ సమయంలో చాలా మంది టీమ్ లీడర్స్ జబర్దస్త్ షో లో అవకాశం కావాలంటే రూమ్ కు వస్తావా అని అడిగేవారు అని హరి అన్నాడు. అల మొగవారు సైతం అల అడిగేసరికి కాస్త కంగుతిన్నాను. ఇంతకు వారు ఎవరు అనే పేర్లు మాత్రం బయట పెట్టలేదు. ఇక నా సొంత అక్క కూడా నన్ను హిజ్రా అని అంది అని ఆవేదన వ్యక్తం చేశాడు.