యాంకర్ శ్యామల బుల్లితెరపైకి రావడానికి చాలా కష్టపడింది. సినిమాలో కనిపిచాలనే తపనతో ఆమె వాళ్ళ అమ్మను తీసుకొని తన సొంత ఊరు నుండి హైదరాబాద్ కు వచ్చింది. మొదట్లో అందరిలాగే కష్టాలను చూసింది. ఆ తర్వాత ఇండస్ష్ట్రి లో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే పట్టుదలతో యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టింది, మా ఊరి వంట, పట్టుకుంటే పట్టు చీర వంటి టివి షోలకు కొంతకాలం యాంకర్ గా కొనసాగింది.
ఆ తర్వాత సిరియల్స్ లలో ప్రధాన పాత్రలు ఉన్నటువంటి క్యారెక్టర్స్ రావడంతో ఇంకా వెన్నక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడ మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. లౌఖ్యం, గుండెల్లో గోదారి, ఒక లైలా కోసం… ఇంకా ఎన్నో మంచి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె లైఫ్ ను బిగ్ టర్న్ తిప్పింది బిగ్ బాస్ షో. నాని హోస్ట్ గా చేసిన ఆ షో తో ఆమెకు మంచి పేరు వచ్చింది. శ్యామల పర్శ్నల్ విషయానికి వస్తే సిరియల్స్ లలో నటించే సమయంలో నరసింహ అనే నటుడితో ప్రేమలో పడింది. డేటింగ్ లు మీటింగ్ లు అంటూ తెగ తిరిగేశారు.
ఆ తర్వాత వారు తమ ప్రేమను పెల్లిగా మార్చుకున్నారు. ఇప్పుడు వారికి ఓ బాబు. అయితే శ్యామల విడాకులు తీసుకుందనే వార్తలు గతంలో కూడా వచ్చాయి. ఇప్పుడు అవే వార్తలు మరోసారి రావడంతో ఆమె స్పందించారు. నాకు, మా ఆయనకు విడాకులు ఇచ్చింది నెటిజన్సే అంటూ వ్యంగ్యంగా సమదానం ఇచ్చారు. ఇప్పటికే మేము చాలా సార్లు విడిపోయాము మమ్ములను వారే విడగొట్టారు. మేము ఇద్దరం కలిసి కనిపించగానే విడాకుల విషయం అబద్దం అనుకుంటారు అని అంది. మా వారు చాలా రిజర్వ్డ్ ఎక్కువగా బయటకు రారు. అని ఆమె అన్నారు. విడాకులు తీసుకున్నామనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి ఆమె స్పష్టం చేసింది.