శ్రీ దేవి, జయప్రద ఇద్దరు స్టార్ హీరోయిన్స్. సినిమాల విషయంలో ఎవరు తగ్గేది కాదు ఒక్కరిపై ఒక్కరు పై చెయ్యి సాదించుకోవాలని చూసేవాళ్ళు. అంత టఫ్ కాంపిటీషన్ నడిచేది వారి మధ్య. బయట మాత్రం వీరిద్దరు గొడవపెట్టుకున్నారు అందుకే ఒకరికొక్కరు మాట్లాడుకోరు అనే టాక్ ఉంది. అయితే ఈ విషయంపై జయప్రద క్లారీటి ఇచ్చారు. ఇండియన్ ఐడల్ 12 గెస్ట్ గా వచ్చిన ఆమె శ్రీ దేవి తో గొడవ విషయమై స్పందిచారు.
నేను శ్రీ దేవి ఎప్పుడు ఎదురు ఎదురు పడి గొడవకు దిగలేదు. మా ఇద్దరి మధ్య బాగా పోటీ ఉండేది ఇది వాస్తవం. మేము కలుసుకొని మాట్లాడుకుంది కూడా చాలా తక్కువనే. ఒకానొక సినిమాలో మేము ఇద్దరం అక్క చెల్లెళ్లుగా నటించాము. మాకు పోటీ అనేది ఏ విదంగా ఉండేది అంటే నటుడు జితేంద్ర రాజేష్‌కుమార్ మా ఇద్దరినీ ఒక్క గదిలో ఉంచి ఓ గంట పాటు లాక్ చేశాడు. ఆ సమయంలో మేము ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కానీ ఇద్దరం ఎదురు ఎదురుగా సోఫాపైనే కూర్చున్నాం.
కోల్డ్ వార్ ఉండేది తప్ప బహిరంగంగా ఎప్పుడు తిట్టుకోలేదు. మమ్ములను కలపాలని సినిమా ఇండస్ ష్ట్రి లో చాలా మంది ప్రయత్నించారు కానీ మేము మాత్రం కలవలేదు. నాకు తెలిసి మేము కలిసింది కూడా ఓ మూడు సార్లు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం వరకే మా పరిచయం. ఆతర్వాత ఆమె ఎవరో నేను ఎవరో అనే విదంగా ఉండేవాళ్లం అని జయప్రద అన్నారు.