ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను లోబర్చుకొని కడుపు చేసి పోలీసులకు పట్టిబడిన చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ పై చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియా వేధికగా ముందుకు వచ్చి ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నారు. గతంలో భార్గవ్ చేతిలో మోసపోయిన చాలా మంది అమ్మాయిలు పోలీసులకు కంప్లెంట్ చేస్తున్నారు.
ఇటీవల OMG నిత్య కూడా తన అఫిషియల్ సోషల్ మీడియా అక్కౌంట్ లో భార్గవ్ నాతో టచ్ లో లేడు. నేను అతనిని కలిసి కూడా ఏడాది అవ్వుతుంది. అలాగే ఈ రేప్ కేసుకు నాకు ఎలాంటి సంబందం లేదని ఓ వీడియో ను విడుదల చేసింది. అలాగే మౌనిక అనే అమ్మాయి కూడా భార్గవ్ తో గతంలో వీడియో లు చేసింది. ఇప్పుడు భార్గవ్ రేప్ కేసు ఘటన బయటకు రావడంతో మౌనిక అనే కాకుండా ఆయనతో డ్యూతే చేసిన చాలా మంది అమ్మాయిలు మాకు ఎలాంటి సంబందం లేదని చెబుతున్నారు.
ఈ భార్గవ్ గతంలో కూడా చాలా మంది అమ్మాయిలను ప్రేమ పేరు చెప్పి లోబరుచుకోవడం జరిగింది. ఆ భాదితులు ఇప్పుడు ధైర్యం గా ముందుకు వచ్చి పోలీసు లకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం భార్గవ్ పై దిశ చట్టం, ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు భాదితురాలు ఎవరు ఆ మైనర్ బాలిక ఎవరు అనే విషయాన్ని పోలీసులు ఆమె పేరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు మాత్రం భార్గవ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.