చైనా లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తుంది. కరోనా దెబ్బకు అన్నీ రంగాలకు చెందిన పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ పడింది. ఇక సినిమా రంగానికి వస్తే చాలా మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారు. చాలా సినిమా షూటింగ్ లు పోస్ట్ పోన్ అయ్యాయి. సినిమా విడుదలలు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ అంటూ మళ్ళీ లాక్ డౌన్ వైపు గవర్నమెంట్ అడుగులు వేస్తుంది.
ఇప్పటికే థియేటర్స్ మూత పడ్డాయి. కరోనా తగ్గుముఖం పడితే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నది. ప్రతి శ్రీ రామనవమి కి సినిమా విడుదల లు మరియు ఫస్ట్ లుక్ లు, టిజర్ మరియు ట్రైలర్ రిలీజ్ లు ఉండేవి కానీ కరోనా ఎఫెక్ట్ కు గత ఏడాది మరియు ఈ ఏడాది శ్రీ రామనవమి కి ఎలాంటి అప్డేట్ లేదు. ఆల్రెడీ విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలే పోస్ట్ పోన్ అవ్వుతున్నాయి.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు మరియు దర్శకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది పూర్తిగా కరోనా తగ్గుముఖం పట్టి వచ్చే ఏడాది అయిన సినిమాలు శ్రీ రామనవమి కి విడుదల అవ్వుతాయని ఆశిద్దాం.