విశాక కు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను ఫన్ బకెట్ భార్గవ్ రేప్ చేసి ఆమెను గర్భవతిని చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిపై దిశ చట్టం కింద కేస్ నమోదు అవ్వడంతో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు . చెల్లి చెల్లి అంటూ పిలుస్తూనే ఆ మైనర్ బాలికను ఎలా రేప్ చేశావు అంటూ సోషల్ మీడియా వేధికగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా టిక్ టాక్ తో పేరు సంపాదించుకున్న భార్గవ్ కు అమ్మాయిల్లో చాలా ఫాలోయింగ్ ఏర్పడింది.
ఆ క్రమంలో అమ్మాయిలు ఆయనతో వీడియో డ్యూయెట్ లు కూడా చేసేవారు. అందులో OMG నిత్య కూడా ఒక్కరు. ఓ మైగాడ్ ఓ మైగాడ్ అంటూ నిత్య చేసిన ఓ వీడియో అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. నిత్య కూడా ఆలు సందర్భాల్లో భార్గవ్ తో డ్యూయట్ వీడియో లు చేసింది. ఇప్పుడు భార్గవ్ రేప్ కేసులో ఇరుక్కోవడంతో నిత్య పేరును సోషల్ మీడియాలో భాగ వాడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లితో కలిసి ఓ వీడియో ను రిలీజ్ చేసింది. నేను ఎందుకు వచ్చానో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది అంటూ..
నాకు ఫన్ బకెట్ భార్గవ్ కు ఎలాంటి సంబందం లేదు. ఇప్పుడు నాకు ఫోన్ కాంటాక్ట్ లోకూడా లేడు. నేను గత ఏడాది కాలం గా ఆయనతో టచ్ లో లేను. నాకు కూడా నా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా మెసేజ్ లు పెడితేనే అసలు విషయం తెలిసింది. దయచేసి సోషల్ మీడియాలో నా ఫోటో లు వేసి నన్ను చూపించవద్దు. మేము ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాం అన్నారు. చివరగా నా పై మీమ్స్ వేసే వారికి కూడా చెబుతున్నా నన్ను ఇందులోకి లాగకండి ఇది మీకు తెలియక జరిగి ఉంటుందని అభిప్రాయ పడుతున్న అని అన్నారు.