పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ పింక్ చిత్రం తెలుగు రీమేక్ వకీల్ సాబ్ తో ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో మరో నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు అందులో రెండు చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి. మలయాళం మూవీ అయ్యపనుమ్ కొషియమ్ ను తెలుగులో సాగర్ చంద్ర రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ 90 రోజులు డేట్స్ కాటేయించినట్లుగా సమాచారం.
ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో టాలీవుడ్ హల్క్ రానా నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలోనే క్రిష్ తో హరిహర విరమల్లు అనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. పీరియాడికల్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు చిత్రాల తర్వాత గబ్బార్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ సినిమా మరియు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చెయ్యాలిసి ఉంది.
ఈ నాలుగు చిత్రాలు పూర్తి అయిన తర్వాత నిర్మాత జే పుల్లారావు వచ్చే ఏడాది పవన్ తో ఖచ్చితంగా ఓ సినిమా ను నిర్మిస్తాను అని చెబుతున్నాడు. జేబి ఎంటర్టైన్మెంట్ పతాకంపై జే భగవాన్ తో కలిసి ఓ సినిమా ను నిర్మిస్తాను. పవన్ తో సినిమా చెయ్యాలి అనేది నా కల. అందుకోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాను. అందుకు మంచి కథను కూడా సిద్దం చేశాను అని అన్నారు. అలాగే దేవకట్ట దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది అన్నారు.