మెగా స్టార్ చిరంజీవి ఎవరి అండదండ లేకుండా సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి. అంచలంచెలుగా ఎదుగుతూ కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆపద అన్నవారికి సాయం చేస్తూ ప్రజల దృష్టిలో మంచి పేరును తెచ్చుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ పేరుతో సామాజిక సేవ చేస్తున్నాడు.
ఆయన వ్యక్తిత్వం నచ్చి తెలుగు ప్రజలు ఆయన్ను తమ పెద్ద అన్నగా అదరిస్తారు. అభిమానులు ఆపదలో ఉన్నారు అని తెలిస్తే వారికి ఏదో ఓరకంగా సాయం చేస్తూ అందిస్తాడు మెగాస్టార్ చిరంజీవి. కరోనా కారణంగ తన అభిమానులు అయిన ఇద్దరినీ కోల్పోయ్యాడు ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…
ఎంతో కాలంగా అభిమానులు, అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నా బ్లడ్ బ్రదర్స్ కదిరి వాస్తవ్యులు ప్రసాద్ రెడ్డి గారు, హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనా బారిన పడి,ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారిరువురి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. వీరిద్దరులో ఒక్కరిది అనంతపురం జిల్లా కదిరి కాగా వెంకటరమణ ది హైదరాబాద్.