జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా కరోనా తో బాద పడుతున్నాడు. అపోలో నుండి ఓ వైద్య బృందం చికిత్స అందిస్తుంది. ఈ నెల మూడోవా తారీఖున పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న అతడికి కాస్త ఒంట్లో నలతగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది.
అయిన బాడి పెయిన్స్ కాస్త జ్వరం ఉండటంతో తన ఫామ్ హౌస్ లోని సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళాడు.అక్కడే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. కరోనా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చిన కానీ ఊపిరితిత్తులో నిమ్ము చేరడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో అక్షిజన్ సిలిండర్స్ ద్వారా శ్వాస అందించారు. మొదటి రెండు రోజులు ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్ నేడు ఉదయం ట్రినిటీ హాస్పటల్ లో మరోసారి కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా నెగటివ్ అని వచ్చింది.
ఈ విషయం అభిమానులకు తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో చాలా మంది కి కరోనా సోకింది. చిరంజీవి కి మొదట కరోనా అని రిపోర్ట్స్ వచ్చిన అనుమానం తో మరోసారి టెస్ట్ చేయించుకోగ నెగటివ్ అని తేలింది. రామ్ చరణ్, ఉపాసనా, నాగబాబు భార్య, అల్లు అరవింద్, వరుణ్ తేజ్, ఇలా అందరు కరోన భారీన పడ్డవారే.