నేటి సమాజంలో ఆడవాళ్లపై ఏదో ఓ రకంగా మొగవాళ్లు వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నారు. దీనిని అరికట్టడానికి ఎన్నో సామాజిక సంస్థలు ముందు కు వచ్చిన ఫలితం లేకుండా పోయింది. మొగవాళ్ళలో మార్పు అనేది వస్తే తప్ప మరో దారి లేకుండా పోయింది. ఆడవారిపై వేధింపులు అనేవి ప్రతి రంగంలోనూ ఉన్నాయి. వ్యాపార రంగంలోకాని సినిమా రంగంలోకాని, విద్యా రంగంలోకాని, ఆడవారు పని చేసిన ప్రతి చోట మొగవారిచే అవమానాలతో పాటుగా వేధింపులు గురి అవ్వుతున్నారు.
మీటు ఉద్యమం ద్వారా ఎంతో మంది తాము జీవితంలో ఎదురుకున్న శారీరిక, మానసిక బాదాలను ఇలా ప్రతి విషయాన్ని చెప్పుకుంటున్నారు. సామాన్య మహిళా నుండి సెలబ్రేటి వరకు మీటు ద్వారా ధైర్యం చేసి వెలుగులోకి వస్తున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడిస్తున్నారు. తాజాగా యాంకర్ లాస్య కూడా మీటు ద్వారా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నేను కూడా మీటు బాదితురాలినే అంటూ..
న్యూ జెర్సీ కి చెందిన ఒక ఎన్‌ఆర్‌ఐ నాకు ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. నాకు అతని మాటలు బట్టి చూస్తే అసలు విషయం అర్థమై నేను కుదరదు అని చెప్పేశాను. అప్పుడు నాతో చాలా పేరున్న పెద్ద పెద్ద యాంకర్స్ పడుకుంటారు నువ్వేంత అంటూ బూతులు తిట్టడం మొదలు పెట్టాడు అని లాస్య అంది. అలాగే ఏదైనా ఈవెంట్ కు హీరోయిన్స్ వెళ్ళితే ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత హీరోయిన్స్ నేరుగా హోటల్ రూమ్స్ కు వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుండి వాళ్ళ రూమ్స్ కు రహస్య రాకపోకలు, బేర సరాలు జరుగుతాయి అని లాస్య మీట ద్వారా తెలియజేసింది.