పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం వకీల్ సాబ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ చిత్రం రిలీజ్ కు ముందు నివేత థామస్ మరియు అంజలి లకు కరోనా పాజిటివ్ రావడంతో వారు క్వారంటైన్ లోకి వెళ్ళారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా కరోనా సోకినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పవన్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీమ్ పవన్ కు కరోనా సోకినట్లుగా ప్రెస్ నోట్ విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ కు వెళ్ళి అక్కడే కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఇక ఆయన కోసం అపోలో నుండి ప్రత్యేక వైద్య బృందం సేవలు అందిస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫేక్ ఫోటో బాగా వైరల్ అవ్వుతుంది. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ బెడ్ పై పడుకొని ఉండగా రామ్ చరణ్ పక్కనే ఉన్నాడు. ఓ డాక్టర్ పవన్ కళ్యాణ్ యొక్క బిపి ను చెక్ చేస్తున్నాడు.
ఇది పాత ఫోటో ఎలాగా అంటే కరోనా వచ్చిన వ్యక్తి వద్దకు మాస్క్ లేకుంట ఎవరు వెళ్లరు . అలాగే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మరియు డాక్టర్ కూడా మాస్క్ లేకుండా ఉన్నారు. కరోనా వచ్చిన వ్యక్తి వద్దకు వెళ్ళాలంటే ఈ రోజుల్లో అయినవారే దగ్గరకు రావడం లేదు అలాంటి పవన్ వద్దకు చరణ్ ఎలాంటి సేఫ్టీ లేకుండా ఎలా వెళ్లగడు కావున ఇది ఫేక్ ఫోటో అని తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ తెలుసుకుంటుంది. రామ్ చరణ్ అయిన భార్య ఉపాసనా అపోలో వైద్యుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన కరోనా వైరస్ భారీ నుండి త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.