టాలీవుడ్ లో అందమైన కపుల్స్ లలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లు ఒక్కరు. బన్నీ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు ఒక్క అబ్బాయి ఒక్క అమ్మాయి. బన్నీ ఆ పిల్లలతో చేసే సందడి మామూలుగా ఉండదు. నిరంతరం సోషల్ మీడియాలో వాళ్ళకు సంబందించిన వీడియో లను బన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాడు.
తాజాగా బన్నీ ఇంటర్వ్యూలో తను ప్రేమలో పడిపోవడానికి ముఖ్య కారణం స్నేహలత రెడ్డి లో ఉన్న మంచి క్వాలిటీస్ అని చెబుతున్నాడు. మొట్ట మొదటిసారిగా ఓ నైట్ క్లబ్ లో స్నేహలత రెడ్డి ని బన్నీ చూశాడు అంట. అందరు మోడ్రన్ డ్రస్ లో వస్తే ఆమె మాత్రం ట్రెడిషినల్ డ్రెస్ లో వచ్చింది అంట. అదే కాకుండా ఆ పార్టీ లో ఆమె యొక్క తీరు బన్నికి బాగా నచ్చింది అంట అందుకే ఆమెను చూసిన మొదటిసారే ఆమె ప్రేమలో బన్నీ పడిపోయాను అని చెబుతున్నాడు.
స్నేహలత రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నప్పటి నుండి బన్నీ కు బాగా కలిసి వచ్చింది. స్టార్ హీరోగా మారిపోయాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఈమధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంటపురంలో అనే చిత్రంలో నటించి మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ నటుడు ఫాహిద్ ఫాసిల్ ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తున్నాడు.