బాలీవుడ్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి శ్రీ రామ్ వేణు దర్శకత్వం వహించగ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించాడు. పవర్ స్టార్ తన సినిమా కెరీర్ లో ఇలాంటి పాత్రను మునుపు ఎన్నడూ పోషించలేదు. కావున ఈ చిత్రంపై మొదటి నుండి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నెల 9 వ తేదీన విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను దక్కించుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వుతుంది. కానీ ఇదే చిత్రం యూఎస్ లో 600 స్క్రీన్ లలో విడుదల అయింది. అక్కడ ఈ చిత్రం 7 లక్షల డాలర్లు మాత్రమే రాబట్టాడు. ఇటీవల విడుదలైన జాతి రత్నాలు అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. వకీల్ సాబ్ అక్కడ బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలంటే ఇంకో 30 శాతం వసూళ్లను రాబట్టాలి. ట్రేడ్ నిపుణులు మాత్రం కష్టమే అని చెబుతున్నారు.
బ్రేక్ ఈవెన్ ను చేరుకోపోవడానికి ముఖ్య కారణం పింక్ చిత్రానికి రీమేక్ కావున ఆల్రెడీ పింక్ చిత్రాన్ని హింది వెర్షన్ లో చూసి ఉంటారు అందుకే అంతంత మాత్రమే అక్కడ వసూళ్లను రాబడుతుంది. అదే కమర్శల్ సినిమా అయితే మాత్రం ఓ రేంజ్ లో కలెక్షన్స్ ఉండేవి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ముడున్నారా ఏండ్ల తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు.