జూనియర్ ఎన్టిఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవ్వుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లేవల్లో విడుదల అవ్వుతుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టిఆర్ క్రేజ్ మరింత పెరగనున్నది. పాన్ ఇండియా హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టిఆర్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చెయ్యాలిసి ఉంది.
ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ మరియు అన్న కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించనున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ చిత్రం ను పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో తెరపైకి కొరటాల శివ పేరు వచ్చింది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, యువ సుధా బ్యానర్ లో మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నిర్మించనున్నాడు. ఇక నుండి ఎన్టిఆర్ భవిష్యత్తులో తాను చేయబోయే సినిమాలకు అన్న కళ్యాణ్ రామ్ ను కూడా భాగస్వామ్యం చెయ్యాలని భావిస్తున్నాడు.
అందుకే తన ప్రతి సినిమాకు కళ్యాణ్ రామ్ ను నిర్మాత గా తీసుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ కూడా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కళ్యాణ్ రామ్ నిర్మాత కొన్ని సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. అలాంటి సమయంలో ఎన్టిఆర్ జై లవకుశ సినిమాకు నిర్మాతగా అవకాశం ఇచ్చాడు ఆ సినిమా మంచి విజయం సాదించడంతో కళ్యాణ్ రామ్ కు బాగానే లాభాలు వచ్చాయి.
ఇకపై తాను చేయబోయే సినిమాలకు కళ్యాణ్ రామ్ ను నిర్మాతగా తీసుకోబోతున్నాడు అని తెలుస్తుంది. ఎలాగైనా అన్నను వదిలే ప్రసక్తే లేదు అని అన్నదమ్ముల అనుబందం ను గుర్తు చేస్తున్నాడు.