మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఖలేజా అనే చిత్రం వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.. ఈ చిత్రం పరాజయం చవి చూడటంతో మహేష్ మరల త్రివిక్రమ్ వైపు తిరిగి చూడలేదు. కానీ తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్ నుండి అందుతున్న సమాచారం మేరకు త్వరలో వీరి కలయికలో సినిమా ఉండబోతున్నదని తెలుస్తుంది.
ఇవే వార్తలు గతంలో కూడా వినిపించాయి. కానీ……. మరో కొద్ది రోజుల్లో వీరి కాంబినేషన్ లో సినిమా గురించి అఫిషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్, పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం ఓ రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 27వ సినిమాకు మాటలు స్క్రీన్ ప్లే డైలాగులు అందిస్తున్నాడు.
అతి త్వరలో ఎన్టిఆర్ తో ఓ సినిమాను తెరపైకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రం తర్వాత మహేష్ తో ఓ సినిమా తెరపైకి వెళ్లనున్నది. ఆలోగా మహేష్ కూడా సర్కారు వారి పాట చిత్రం నుండి కాస్త రిలీఫ్ అవ్వుతాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చెయ్యనున్నాడు. ఇది అందరికి తెలిసిన విషయమే…