రామాయణం యొక్క కథను మరోసారి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అదిపురుష్ అనే పేరుతో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు గా, సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో నటించనున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ నటించనున్నది. ఇప్పటికే వీరి పేర్లను దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక లక్ష్మణుడు పాత్రలో సన్నీ సింగ్ నటించనున్నాడు .
రామాయణం కథను మనం ఓసారి పరిశీలిస్తే వారు ఎక్కువ భాగం అడవిలోనే గడిపారు తండ్రి మాటను గౌరవించి రాముడు 14 ఏండ్లు వనవాసం చేసిన సంగతి అందరికి తెలిసిందే. కావున ఈ చిత్రం యొక్క షూటింగ్ కూడా ఎక్కువ భాగం అడవిలోనే షూట్ చెయ్యాలి అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో బయటకు వెళ్ళలేని పరిస్థితి మరోసారి నెలకొన్నది. కావున దర్శకుడు ఓం రౌత్ ఓ పెద్ద అడవి సెట్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లుగా తాజా సమాచారం.
ఇక్కడే ప్రధాన తారాగణంతో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నాడు. అడవి ఎంత న్యాచురల్ గ ఉంటుందో అంతే న్యాచురాలిటితో ఈ సెట్ ను నిర్మిస్తున్నాడు. అందుకు భారీగానే నిర్మాతలతో ఖర్చు పెట్టిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని టి సిరీస్ ఫిల్మ్స్ రెట్రోఫీల్స్ సంస్థలు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 11 న విడుదల అవ్వనున్నది.