క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా రంగంలోనే లేదు. ప్రతి రంగంలోను ఉంది. ఎంతో మంది ఆడవాళ్ళు క్యాస్టింగ్ కౌచ్ కు బలైపోతున్నారు. లైఫ్ లో తమకు అంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే క్రమంలో చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ ను ఎదురుకుంటున్నారు. సినిమా రంగంలో కాస్త ఎక్కువగానే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. అలనాటి సీనియర్ హీరోయిన్స్ నుండి నేడు యంగ్ హీరోయిన్స్ వరకు ఎన్నో బాదలను, ఇబ్బందులను, అవమానాలను ఎదురుకుంటున్నారు.
ప్రస్తుతం ఉన్న యంగ్ జెనరేషన్ హీరోయిన్స్ మాత్రం క్యాస్టింగ్ కౌచ్ పై గట్టిగానే బహిరంగంగా మాట్లాడుతున్నారు. తమకు జరిగిన అన్యాయం ను సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ తో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు అంకిత లోఖండే తన జీవితంలో ఎదురైన అలాంటి సంఘటను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సౌత్ సినిమా ఇండస్ష్ట్రి కి సంబందించి ఓ స్టార్ హీరో నన్ను తన వద్దకు వచ్చు నీకు సినిమా ఆఫర్ కావాలంటే ఆ నిర్మాత గదిలోకి వెళ్ళాలి అని చెప్పాడు.
ఆ మాటలకు కాస్త కంగారూ భయం వేసింది ఆ తర్వాత నేను వెంటనే సినిమాలో ఆఫర్స్ కోసం డిన్నర్లు నైట్ పార్టీల కోసం నేను కాంప్రమైజ్ కావాలా అంటూ సమాదనం చెప్పడంతో ఆ స్టార్ హీరోకి నోటివెంట మాట మాత్రం రాలేదు. ఈ విషయంపై నేటిజెన్స్ ఇంతకు ఆ స్టార్ హీరో మరియు నిర్మాత ఎవరో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ అంకిత లోఖండే మాత్రం ఆ విషయం మాత్రం వెల్లడించలేదు. బుల్లి తెర సీరియల్ నటి ద్వారా అంకిత సౌత్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.