గత ఏడాది జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు. గత కొన్నాళ్లుగా శర్వానంద్ కు సక్సెస్ లు లేవు. ఇలాంటి సమయంలో ఆయన శ్రీకారం సినిమా చేశాడు. మొదట పెద్దగా అంచనాలు లేకున్నా విడుదల ముందు చిరంజీవి, చరణ్, కేటీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ సపోర్ట్ గా నిలవడంతో శ్రీకారంపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తూ, ఫారిన్ వెళ్లే అవకాశం వచ్చిన శర్వానంద్ ఉన్నట్లుండి ఉద్యోగం మానేసి వ్యవసాయం చేసేందుకు సిద్దం అవుతాడు. నష్టాల్లో ఉన్న వ్యవసాయంను అందరు వద్దనుకున్న వ్యవసాయంను శర్వానంద్ ఎందుకు చేయాలనుకున్నాడు, ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ వాటిని అధిగమించి ఎలా కొత్త వ్యవసాయంను చేసి లాభసాటిగా మార్చాడు అనేది సినిమా కథాంశం.
విశ్లేషణ :
ఈతరం యువతలకు వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా రైతు పడుతున్న కష్టాలను మరీ భారంగా కాకుండా మంచి ఎంటర్‌టైన్ మెంట్ ను జోడించి అసలు విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు కిశోర్ రెడ్డి చూపించే ప్రయత్నం చేసి ఆకట్టుకున్నాడు. కథలో మెయిన్ పాయింట్ ట్రైలర్ చూస్తున్న సమయంలో కన్విన్సింగ్ గా అనిపించలేదు. కాని సినిమాలో చూస్తున్నప్పుడు మాత్రం అతి అనిపించకుండా సహజంగా సాగిపోయింది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి విదేశాలకు వెళ్లే అవకాశంను వదిలేసి రైతుగా మారడం కాస్త లాజికల్ గా ఆలోచిస్తే విడ్డూరంగా అనిపించినా కథలో దాన్ని దర్శకుడు చూపించిన విధానం కన్విన్సింగ్ గా అనిపించింది. మొత్తంగా దర్శకుడు కథ మరియు స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడ ఢీ లా పడకుండా సాగించాడు.
ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా సాఫీగా బోర్ ఫీలింగ్ లేకుండా సాగిపోయింది. శర్వానంద్ పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది. ఆ పాత్రకు ఎప్పటిలాగే శర్వా జీవం పోసినట్లుగా నటించాడు. హీరోయిన్ ప్రియాంక అరూల్ మోహన్ తన పాత్రకు తగ్గట్లుగా నటించింది. అయితే ఆమె గొప్పటి నటించేంత స్కోప్ ఏమీ లేదు. రావు రమేష్ మరియు సాయి కుమార్ లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సాయి కుమార్ విలన్ పాత్రలో సహజంగా కనిపించారు. పాటలు ఒకటి రెండు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించే విధంగా ఉంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చక్కగా పల్లె అందాలను చూపించింది. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు మినహా అంతా బాగానే ఉంది.
ప్లస్ పాయింట్స్ :
- కథ
- శర్వానంద్ నటన
- మంచి మెసేజ్
- వ్యవసాయం సీన్స్
- సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్
- భావోద్వేగాలు
మైనస్ :
- కొన్ని సీన్స్ కు కత్తెర పడాల్సింది
- కొన్ని సీన్స్ సహజత్వంకు దూరంగా ఉన్నాయి
- ఎంటర్‌టైన్‌మెంట్ పై ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సింది
చివరగా…
యువత తప్పకుండా చూడాల్సిన ‘శ్రీకారం’
రేటింగ్: 3.25/5.0