తెలంగాణ టిఆర్‌ఎస్ మంత్రి కేటిఆర్ శ్రీకారం గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు ముఖ్య అతిథి గా విచ్చేశాడు. ఈ సందర్భంగా శ్రీకారం టీమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ… నేను శర్వా సినిమాలు చూస్తూ ఉంటాను అయిన నటించిన ప్రతి సినిమా చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా శ్రీకారం సినిమా గురించి చెప్పాలంటే వ్యవసాయం చెయ్యడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి.. వ్యవసాయం లోనే సాయం ఉందని గుర్తు చేశాడు..
కానీ నేటి వ్యవసాయ పరిస్థితులు చూస్తుంటే వ్యయం పెరిగి పోయింది.. నేడు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టె పరిస్థితుల్లో రైతు లేడు. అందుకే రైతులకు అలాంటి కష్టాలు రాకూడదనే కేసిఆర్ గారు పెట్టుబడిని అందిస్తున్నాడు. నాన్నకు మొదటి నుండి కూడా వ్యవసాయం అంటే చాలా పిచ్చి ఆ నెపంతోనే రైతులకు మంచి మంచి స్కీమ్ లను తీసుకువస్తున్నాడు. ఓ రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎంతగానో అభివృది చెందుతుందని కేటిఆర్ గారు అన్నారు.
మీరు కూడా ప్రభుత్వాలపై ప్రత్యేక్షంగా కాని పరోక్షంగా గాని ఒత్తిడి తీసుకురావాలని కోరాడు. శ్రీకారం చిత్రం కూడా అలాంటి కథే అని కేటిఆర్ గారు అన్నారు. ఇక శర్వానంద్ మాట్లాడుతూ కేటిఆర్ దేశం మొత్తానికి యూత్ ఐకాన్ అని అన్నారు. ఓ తండ్రి అడుగు జాడల్లో నడవాలన్న ఓ కొడుకు కథే మా ఈ శ్రీకారం అని అన్నాడు. ఈ చిత్రంలో రావు రమేష్ పాత్ర చాలా కీలక కానున్నది. ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగ ఈ చిత్రం రేపు విడుదల అవ్వుతుంది. 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాని భారీ బడ్జెట్ తో నిర్మించింది.