నటుడు హర్షవర్ధన్ గుర్తు ఉన్నాడా.. చాలా మందికి ఈ పేరు చెబితే తెలియక పోవచ్చు. కానీ మనిషిని చూపిస్తే ఇతనేనా అని అంటారు అందరు. నటుడుగా, దర్శకుడు గా, రచయత గా మంచి అనుభవం ఉంది అతనికి. ఐతే, అనుకోకుండా ఒకరోజు డేంజర్, అతడు, లీడర్ ఇంకా ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. బుల్లితెరపై కూడా ఆయన తన సత్త చాటుకున్నాడు. ప్రస్తుతం చాటుతున్నాడు కూడాను.. అమృతం సీరియల్ లో మెయిన్ లీడ్ ఉన్న పాత్రలో నటించాడు.
ఒకానొక ఇంటర్వ్యూ లో నితిన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నితిన్ నాకు సోదరుడు తో సమానం ఎంతో నిజాయితీ ఉన్న మనిషి. నితిన్ కు మొదటి నుండి కూడా సినిమాలపై మంచి అవగాహన ఉంది. బహుశా అది తన తండ్రి నుండి వచ్చింది అనుకుంటా.. ఆయన నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశాడు. ఎలాంటి సినిమా చెయ్యాలి. ఏది చేయకూడదు అనేది నితిన్ కు బాగ్ తెలుసు అని చెప్పాడు. అలాగే నితిన్ కు నాకు మంచి అనుబందం ఏర్పడటానికి కారణం ఇష్క్ సినిమా ఆ చిత్రంలోని కొన్ని సీన్స్ ను నేను రాశాను.
అవి నితిన్, విక్రమ్ కు బాగా నచ్చి మరో సినిమాలో తప్పకుండా ఛాన్స్ ఇస్తామని చెప్పారు అలా వచ్చిందే మనం చిత్రం. ఈ చిత్రంలోని కొన్ని సన్నెవేశాలను నేను రాశాను. నితిన్ కు మాత్రం గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఆ విదంగా మేము కలిసి పనిచేయడం వలన మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. అయిన నటించిన ఎన్నో సినిమాల్లో నేను కూడా నటించాను. ఇష్క్ తర్వాత నేను నితిన్ కలిసి ఓ సినిమాలో నటించాము ఆ చిత్రం 20 పర్సెంట్ చిత్రీకరణ కూడా పూర్తి అయింది. అప్పుడే నితిన్ కు అర్థం అయింది.. ఈ చిత్రం ఫ్లాఫ్ అవ్వుతుందని.. అప్పుడు నితిన్ నా దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ లో మార్పులు చేద్దాం అని చెప్పాడు నేను కొన్ని మార్పులు చెప్పాను అవి నితిన్ కు బాగా నచ్చింది. వెంటనే చేద్దాం అన్నారు ఆ విషయం దర్శకుడు, నిర్మాతకు చెబితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ సినిమా విడుదల తర్వాత ప్లాప్ చిత్రంగా నిలిచింది.