కోట శ్రీనివాస్ రావు తెలుగు సినిమాకు దొరికిన ఓ అద్బుతమైన నటుడు. వ్యవసాయ కుటుంబంకు చెందిన వ్యక్తి కోట గారు. చిన్నప్పటి నుండి స్టేజ్ నాటకాలు వేసేవాడు. ఆ తర్వాత సినిమాలో అవకాశం రావడం తో ఆయన ఇంకా వెనకకు తిరిగి చూసుకోలేదు. ఆయన మొదటి సినిమా చిరంజీవి హీరోగా నటించిన ప్రాణం ఖరీదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, ఇలా ఎన్నో పాత్రలలో ఆయన నటించాడు.
ఎనిమిది పదుల వయసు దగ్గర పడుతున్న ఆయనకు నటనపై మక్కువ ఇంకా పోలేదు. అందుకే అయిన ఇంకా సినిమాల్లో నటిస్తున్నే ఉన్నాడు. లాక్ డౌన్ కారణముగా ఇంట్లో ఉండటంతో కాస్త బోర్ గా ఫీల్ అయిన కోట గారు సినిమాలో మరల తిరిగి నటించేందుకు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ వినాయక్ గారికి ఫోన్ చేసి సినిమాలో వేషం కోసం అడిగినట్లుగా అయిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్, క్రిష్ చిత్రంలో ఓ పాత్రలో నటించనాని చెప్పారు.
ఇక మీదుట కూడా సినిమాలో ఛాన్స్ లు వస్తే తప్పకుండ నా వయసుకు తగిన పాత్రలను చేస్తానని చెప్పాడు. నటనకు వయసుతో సంబందం లేదని ఆయన మరోసారి గుర్తుచేశాడు. కోట శ్రీనివాస్ గారు ఒక్క తెలుగు సినిమాలోనే అయిన నటించలేదు. తమిళ, కన్నడ, మలయాళ, హింది, సినిమాలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు తో సమానంగా తమిళంలో చాలా సినిమాల్లో నటించాడు.
దాదాపుగా అన్నీ పాత్రలో నటించిన కోట చివరగా సింగర్ గా కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో మందుబాబూలం మేము మందు బాబూలం అనే పాటను కూడా పాడారు.