టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ ల నిమిత్తం ఫుల్ బిజీగా ఉంటాడు. షాట్ మధ్యలో గ్యాప్ దొరికితే రెస్ట్ తీసుకోవడానికి ఓ విలాసవంతమైన కారవాన్ ను కొనుగోలు చేశాడు. మహేష్ బాబు అభిరుచులకు తగిన విదంగా దీనిని ముంబయి కు చెందిన ప్రముఖ ఇంటీరియర్ సంస్థ దీనికి హంగులు హద్దింది. ఇక నుండి మహేష్ తన ఔట్ డోర్ షూటింగ్ ల కొరకు దీనిని ఉపయోగించనున్నాడు. ఇప్పటికే మహేష్ కారవాన్ లోపల ఉన్న కంపర్ట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
దీని కాస్ట్ ఎంత అనే విషయం తెలియలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ కారవాన్ ను నడిపేందుకు స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్స్ ను తీసుకుంటారు. ఎందుకు అంటే ఇండియన్ రోడ్స్ లో ఈలాంటి వెహికిల్ నడపాలి అంటే డ్రైవర్ కు ఎంతో నేర్పు ఓర్పు ఉండాలి. ఇలాంటి కారవాన్ వెహికిల్ ను అల్లు అర్జున్ కూడా కొనుగోలు చేశాడు. ఫాల్కోన్ కంపెనీకి చెందినది. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్బుతంగా ఉంది.
ఇది అల్లు అర్జున్ కు సేవలు అందిస్తుంది. ఈ కారవాన్ పై అల్లు అర్జున్ సైన్ ఉంటుంది. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్ ను తీసుకున్నాడు. ఆయనకు నెలకు జీతం వచ్చేసి లక్షకు పైగానే ఉంటుంది. అల్లు అర్జున్ తర్వాత మహేష్ బాబు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మొదటి షెడ్యూల్ ను దుబాయ్ లో జరుపుకుంది. పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల అవ్వుతుంది