మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2018లో వచ్చిన అరవింద సమేత చిత్రం ఎంత పెద్ద విజయం సాదించిందో మన అందరికి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా లెవల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుపుకుంటుంది. ఏప్రిల్ లేదా మే నాటికి షూటింగ్ పూర్తి అవ్వుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ అవ్వనున్నాడు.
ఈ చిత్రం తర్వాత మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి “అయిననూ పోయిరావలే హస్తినకు” అనే టైటిల్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ రిజిస్టర్ చేయించాడు. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి తారక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతానికి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్, రానా సినిమాకు పనిచేస్తున్నాడు. మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. మరో రెండు నెలల్లో త్రివిక్రమ్ కూడా ఈ చిత్రం నుండి ఫ్రీ అవుతాడు.
అయితే ఎన్టీఆర్ 30 చిత్రం కోసం తమిళ నటీమణిని సంప్రదిస్తున్నట్లుగా తాజా సమాచారం. ఆమె ఇటీవల తెలుగులో బ్లాక్బస్టర్ హిట్టు చిత్రాలను సొంతం చేసుకుంది. ఆమె మరేవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ చిత్రంలో విలన్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలోని ఈమె నటించిన పాత్ర త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బాగా నచ్చడంతో ఆమెను సంప్రదిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో పవర్ ఫుల్ లేడి పొలిటీషియన్ పాత్రలో కనిపించనున్నదని వార్తలు వస్తున్నాయి.
ఆల్రెడీ విజయ్ సర్కార్ చిత్రంలో అలాంటి పొలిటీషియన్ పాత్రలోనే ఆమె నటించింది. మరోసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో రాజకీయనాయకురాలిగా కనిపించనున్నదని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.