యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తర్వాత మొత్తం అధికారికంగా ఓ నాలుగు చిత్రాలు లైన్ లో పెడితే అందులో రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే మొదటి నుండి కూడా ఈ చిత్రంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు క్లారిటి ఇవ్వడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
ఇక ప్రభాస్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని వార్తలు వస్తున్న తరుణంలో… తాజా సమాచారం మేరకు యంగ్ రెబల్ స్టార్ డ్యూయల్ రోల్ లో కనిపించడం కాదు రెండు డిఫ్ఫరెంట్ లుక్ లో మాత్రమే ఆయన కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ను తెలంగాణలోని సింగరేణి గనుల్లో జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ మాత్రం లేదు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. ప్రభాస్ లాంటి హీరోను ఢీ కొట్టాలంటే అంటే పర్శనాలిటీ ఉన్న కన్నడ నటుడు మధు గురుస్వామి ని రంగంలోకి దింపుతున్నాడు.
ఇటీవలే ఈ చిత్రంకోసం 100 మంది నూతన నటీనటులను తీసుకున్నారు. ఈ చిత్రాని ప్రముఖ నిర్మాణ సంస్థ హేంబలే భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. కేజిఎఫ్ సిరీస్ కూడా ఇదే బ్యానర్ లో రూపొందింది. ప్రభాస్ సినిమా విషయానికి వస్తే.. సలార్ తో పాటుగా అధిపురుష్ చిత్రాని కూడా లైన్లో పెట్టాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల అధిపురుష్ సెట్ అగ్నికి ఆహుతి కావడంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. మరల సెట్ ను రెడీ చేశారు. త్వరలో ప్రభాస్ ఈ చిత్రం యొక్క షూటింగ్ సెట్ లో సందడి చేయనున్నాడు.
ప్రభాస్ ఈ చిత్రంలో రాముడు పాత్రలో కనిపించనున్నాడు. రావనుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపిస్తాడు. సీత పాత్రకోసం కృతి సనన్ ను అనుకుంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రావలిసి ఉంది. ఈ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని చేయనున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటించనున్నది.