బాలీవుడ్ హీరోయిన్ పరిణతి చోప్రా కు మహేష్ బాబు అంటే తెగ ఇష్టం అంటూ పొగిడేస్తుంది. తాజాగా ఆమె ఓ రెండు సినిమాల్లో నటించింది. అందులో ఒక్కటి సైనా బ్యాట్ మింటన్ నేపథ్యంలోరూపొందింది. మరో దర్శకుడు దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో సందీప్ ఔర్ పింకీ ఫరార్ అనే చిత్రంలో నటించింది. అర్జున్ కపూర్ హీరోగా నటించాడు.
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ విషయమై ఆమె హైదరాబాద్ కు వచ్చేసింది. అక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొంది. సైనా సినిమా గురించి చాలా సంగతులు మీడియా ముఖంగా పంచుకుంది. ఈ చిత్రం కోసం బ్యాట్మింటన్ ను స్వతహాగా నేర్చుకుంది. ఇంకా టాలీవుడ్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని ప్రశ్నించగా టక్కున మహేష్ బాబు అని చెప్పేసింది. అదే కాకుండా ఆయన కండ్లు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే అతని నటన అన్న కూడా నాకు చాలా ఇష్టం అంటు చెప్పేసింది.
సైనా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంకు ఆమోలే గుప్తా దర్శకత్వం వహించాడు. బ్యాట్మింటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ జీవితం ఆదారంగా రూపొందింది. 2012 ఓలంపిక్ గేమ్స్ లో సైనా మూడో స్థానం ను కైవసం చేసుకుంది. ఈ చిత్రానికి అమల్ మాలిక్ సంగీతం అందించాడు. టి సిరీస్ ఫిల్మ్స్ ఫ్రంట్ ఫూట్ పిక్చర్స్ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, సుజయ్ జయరాజ్ రాశేష్ షా లు నిర్మించారు. 26 మార్చి న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల అవ్వుతుంది.