పవన్ కళ్యాణ్ పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదట సినిమాలు చేయను అని చెప్పాడు. కానీ పార్టీని బలోపేతం చెయ్యాలి అంటే ఆర్థికంగా బల పడాలి. ఈ విషయం పవన్ కు బాగా తెలిసి వచ్చినట్లు ఉంది. ఈరోజుల్లో పార్టీని ముందుకు నడిపించాలి అంటే డబ్బు అనేది చాలా ముఖ్యం. అందుకే వరసగా సినిమాలలో నటించేందుకు ఒప్పుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో ఆయన నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అంజలి, నివేత్త థామస్ లు ముఖ్య పాత్రలో నటించారు. కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. ఈ చిత్రం యొక్క థియెట్రీకల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ మొదటి నుండి కూడా ఘట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ నిర్మాతలు మాత్రం నేరుగా థియేటర్ లోనే ఈ సినిమాను విడుదల చేయడానికి మొగ్గు చూపించారు.
వకీల్ సాబ్ విడుదలైన రెండు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యడానికి భారీ మొత్తం లో ఆఫర్ చేస్తుంది. అయిన కానీ నిర్మాతలు దిల్ రాజు, బోణి కపూర్ లు మాత్రం అందుకు సిద్దంగా లేరు. అగ్రిమెంట్ ప్రకారం కనీసం 50 రోజుల తర్వాతనే ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ రైట్స్ ను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఫస్ట్ లుక్ మరియు టీజర్ లు ఆకట్టుకుంటున్నాయి.
ఏప్రిల్ 9వ తేదీన ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఓ చిత్రం సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళం మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. మరోటి వచ్చేసి క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు.