శర్వానంద్ హీరోగా సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం రన్ రాజ రన్. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాడు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ చిత్రం విజయం తర్వాత ప్రభాస్ కోసం మూడు సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎందుకంటే ఆ సమయంలో ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే డార్లింగ్ తో సాహో అనే చిత్రాని తెరకెక్కించాడు.
ఈ చిత్రం డివైడ్ టాక్ ను దక్కించుకుంది. అప్పటికే ప్రభాస్ స్టార్ హీరో గా గుర్తింపు రావడంతో సుజిత్ కూడా ఇండియన్ దర్శకుడుగా మారిపోయాడు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ వరసగా సినిమాలు చేస్తున్న సుజిత్ మాత్రం మరో రెండేండ్లు ఖాళీగా ఉన్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తో లూసిఫర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు అనుకున్నారు. ఈ నేపథ్యంలో సుజిత్ కూడా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసుకున్నాడు. కానీ చివరాకరుకు ఈ చిత్రం మోహన్ కృష్ణ చేతిలోకి వెళ్ళింది.
ఇంకా మరల ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ప్రేమించిన అమ్మాయిని సుజిత్ పెళ్లి చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ సినిమా విషయమై కన్నడ సినిమా ఇండస్ష్ట్రి పై ఫోకస్ పెట్టాడు. అక్కడ స్టార్ హీరోగా రానిస్తున్న సుధీప్ తో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు సిట్టింగ్స్ వేసిన సుజిత్ ఇంకా కిచ్చ సుధీప్ నుండి ఎలాంటి ప్రకటన లేదు. బాలీవుడ్ లో జీ స్టూడియోస్ లో ఓ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడు. సుజిత మొదట యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ను చేస్తూ సినిమాలో అవకాశాలు కొట్టేశాడు. అక్కడ నుండి మరల వెనకకు తిరిగి చూసుకోలేదు.