ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ ప్రస్తుతం అంచనాలను మించి షూటింగ్ జరుపుకుంటుంది. కేజీఎఫ్ 2 విడుదల కాకుండానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా ను మొదలు పెట్టాడు. ఇప్పటికే సింగరేణిలో ప్రభాస్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో ఉండే ప్రతి ఒక్క యాక్షన్ సన్నివేశం హాలీవుడ్ మూవీ యాక్షన్ సన్నివేషంను మించి ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
పెద్ద ఎత్తున యాక్షన్ సన్నివేశాలకు ప్రాముఖ్యత ఇస్తూ సినిమా ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. కేజీఎఫ్ ను మించిన యాక్షన్ సన్నివేశాలను సలార్ లో చూపించడం కోసం హై టెక్నాలజీని మరియు భారీ తారాగణంను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయి యాక్షన్ కొరియోగ్రాఫర్ లను రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి యాక్షన్ సన్నివేశం కూడా రోమాలు నిక్కబోడిచేలా ఉంటాయని అంటున్నారు.
యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండటంతో పాటు గతంలో ఎప్పుడు ఏ సినిమాలో కూడా ప్రేక్షకులు చూడని అనుభవించని ఫీలింగ్ ను కలిగిస్తాయని అంటున్నారు. ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ అభిమానులు చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. బాహుబలి మరియు సాహోల తర్వాత మళ్లీ ఆ రేంజ్ పాన్ ఇండియా మూవీగా ఇది ప్రభాస్ కు నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.