టాలీవుడ్ లో మాస్ మహారాజ్ చాలా కష్టపడి హీరో స్థాయికి చేరుకున్నాడు. ఆయనకు దర్శకులతో గాని మ్యూజిక్ డైరెక్టర్స్ తో గాని మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంగీత దర్శకుడుతో రవితేజకు మంచి అనుబంధం ఉంది ఆయన మరేవరో కాదు థమన్. ఇప్పుడు వరస గా టాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలకు ఆయనే సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం థమన్ టైమ్ నడుస్తుంది. ఇటీవల కాలంలో దేవి శ్రీ ఓ ఊపు ఉపాడు.
ఇలాంటి సమయంలో థమన్ తన సత్తా చాటుతున్నాడు. ఈ సంగీత దర్శకుడు తో రవి తేజ ఏకంగా పదకొండు సినిమాలకు పనిచేశాడు. కిక్ – ఆంజనేయులు – మిరపకాయ్ – వీర – నిప్పు – బలుపు – పవర్ – కిక్-2 – అమర్ అక్బర్ ఆంటోని – డిస్కోరాజా – క్రాక్ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. అలాంటి తరుణంలో రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ఖిలాడి చిత్రంను మిస్స్ అయ్యాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ ఫస్ట్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను పెంచాడు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత రవి తేజ తనతదుపరి చిత్రాని నక్కిన త్రినాదరావు దర్శకత్వంలో చెయ్యనున్నడు. ఇప్పటికే ఆ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఈ చిత్రం కోసం థమన్ ను తీసుకోవాలని రవి తేజ నుండి కూడా ఫోర్స్ చేస్తున్నట్లుగా వినిపిస్తుంది. ఈ చిత్రానికి థమన్ ఒకే అయితే మాత్రం ఏకంగా పన్నెండు సినిమాలకు సంగీతం అందించినవాడు అవ్వుతాడు. కానీ చాలా మంది హీరోలకు ఒక్కటి రెండు సినిమాలకు మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ రవి తేజ సినిమాల విషయంలో మాత్రం అలాంటి థమన్ కీలక పాత్ర చాలా ఉంది.