ఓమర్ లూలు దర్శకత్వంలో ఓరు ఆదార్ లవ్ అనే చిత్రంతో పరిచయం అయింది. ఈ చిత్రంలో రోశన్ అబ్దుల్ రాహూఫ్, నూరిన్ షేరీఫ్ లు హీరోలుగా నటించగా ప్రియ ప్రకాష్ వారియర్, హీరోయిన్ గా నటించింది. ఇదే చిత్రాని తెలుగులో “లవర్స్ డే” అనే పేరుతో డబ్బ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రియ కన్ను కొట్టే సీన్ ఎంత పాపులర్ అయిందో మన అందరికి తెలిసిందే.
మలయాళంలో ఆమెకు కు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగులో నితిన్ తో కలిసి చెక్ సినిమాలో నటించింది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలోని మరో పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించింది. ఈ క్రమంలో తెలుగులో ఆమెకు వరస అవకాశాలు వస్తున్నాయి. ఆర్బి చౌదరి నిర్మాణంలో ఇష్క్ అనే చిత్రంలో నటిస్తుంది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజు సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా ప్రియ ప్రకాష్ వారియర్ పై సోషల్ మీడియాలో ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది అది ఏమిటి అంటే అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వస్తే అమ్మడు రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై అమ్మడు క్లారిటీ ఇచ్చింది. నేను అల్లు అర్జున్ కు వీరాభిమానిని ఆయన తెలుగు సినిమాలు మలయాళం డబ్బింగ్ లో విడుదల అయితే నేను అన్నీ సినిమాలు చూశాను. అలాంటిది అల్లు అర్జున్ తో మూవీ లో ఆఫర్ వస్తే ఎలా రిజెక్ట్ చేస్తాను అని అన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే చిత్రాని చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యాలిసి ఉంది. ఈ చిత్రంలోనైనా ఛాన్స్ వస్తుందేమో చూడాలి. తెలుగులో ఆమెకు ఇప్పుడిప్పుడే అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది మలయాళం హీరోయిన్స్ టాలీవుడ్ లో పాగా వేశారు. వారి సరసన ప్రియ ప్రకాష్ వచ్చి చేరనున్నది.