గత కొన్ని ఎండ్లుగా సరైన హిట్టు లేక సతమతం అవ్వుతున్న సూర్య ఇటీవల కాలంలో సురాయి పోట్రు అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం తమిళ్ తో పాటుగా తెలుగులోనూ డబ్బ్ చేసి అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించింది. ఈమె నిజానికి తెలుగు దర్శకురాలు కానీ ఇక్కడ సరైన అవకాశాలు లేక తమిళంలో సినిమాలు చేస్తుంది.
ఈ చిత్రంలో సూర్య ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటించాడు. ఈ చిత్రం జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా రూపొందించారు. అయిన మాజీ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అలాగే ఇండియన్ డక్కన్ కు ఫౌండర్ కూడాను. ఆయన పాత్రలో సూర్య నటించి మెప్పించాడు. ఒకానొక సన్నివేశంలో సూర్య ప్రేక్షకుల వెంట కన్నీలు కూడా తెప్పించాడు.
సూర్య కు జోడీగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. ఇదే ఈమెకు మొదటి చిత్రం అయిన తన నటనతో ఆమె ఆకట్టుకుంది. కీలక పాత్రలో పరేశ్ రావల్ నటించాడు. ఈ చిత్రాని 2డి ఎంటర్టైన్మెంట్, సిఖ్య ఎంటర్టైన్మెంట్ సంస్థలపై సూర్య, గుణీత్ మొంగా నిర్మించారు. నిజానికి ఈ చిత్రాని థియేటర్ లో విడుదల చెయ్యాలిసింది. కానీ కరోనా కారణంగ థియేటర్స్ ముతా పడటంతో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాదించింది.
తాజా సమాచారం మేరకు ఈ చిత్రం ఆస్కార్ భరిలో నిలుస్తుంది. అవును 366 చిత్రాలు నామినేట్ అయితే అందులో సురాయి పోట్రు కూడా ఉన్నది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రస్ కేటగిరీలో పోటీ పడుతుంది. ఆస్కార్ భరిలో సూర్య సినిమా నామినేట్ అవ్వడం అనేది గొప్ప విషయమే అని చెప్పాలి