హీరో అజిత్ తమిళనాడు లో స్టార్ హీరో. మాస్ ప్రేక్షకులు ఆయనను దేవుడిలా ఆరాదిస్తారు. నిజానికి అజిత్ పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే ఆయన సినిమాలోకి రాకముందు ఇక్కడే బైక్ మెకానిక్ గా పనిచేశాడు. ఆ బైక్ లే ఆయనకు ఇష్టం గా మారాయి. అజిత్ బైక్ నడపడం వంటి వీడియో లు చూస్తే ఆ విషయం మనకు అర్థం అవ్వుతుంది. ఓ స్పొర్ట్స్ బైకర్ ఏ విదంగా బైకు నడుపుతాడు ఆ విదంగా అజిత్ రైడింగ్ ఉంటుంది.
ఇటీవలే ఆయన దేశంలోని అన్నీ ప్రాంతాలను చుట్టేసి వచ్చాడు. దాదాపుగా 10 వేల కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అజిత్ తమిళనాడులో ఉంటున్న ఆయన మనసు మాత్రం హైదరాబాద్ పైనే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చి పోతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం వాలిమై ఈ చిత్రం యొక్క షూటింగ్ ఆర్ఎఫ్సి లో జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన శంషాబాద్ నుండి నేరుగా సైకిలింగ్ చేసుకుంటూ మెహదీపట్నం వచ్చాడు.
అక్కడి నుండి నేరుగా అరంఘర్ చౌరస్తా మీదుగా రామోజీ ఫిల్మ్ సిటీ కి చేరుకున్నాడు. ప్రస్తుతం అజిత్ సైకిల్ రైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా సింపుల్ గా బ్రతికే హీరోలలో అజిత్ కూడా ఒక్కడు. అందుకే కోలివుడ్ లో ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్బ్ అవ్వుతు విడుదల అవ్వుతున్నాయి. చాలా ఏండ్ల కిందట ఆయన నటించిన వాలి, ప్రేమ లేఖ చిత్రాలు తెలుగులో ఎంత పెద్ద విజయం సాదించయో మనం ఆల్రెడీ చూశాం. ఇటీవల కాలంలో ఆయన నటించిన ఎంతవాడుగాని, విశ్వాసం, వివేకం, వీరుడొక్కడే చిత్రాలు తెలుగులో డబ్బ్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం వాలిమై చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల అవ్వుతుంది