మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మోసగాళ్ళు. ఈ చిత్రాని తెలుగు, తమిళ, కన్నడ, హింది, మలయాళ బాషల్లో మొత్తం 5 లాంగ్వేజ్ ల్లో ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. ఈ చిత్రంను ఐటి స్కామ్ లో జరిగిన భారీ కుంబకోణం ను ప్రధానంగా చూపించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది ఏవిఏ ఎంటర్ టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలపై ఈ చిత్రాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నిన్న విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు ఈ చిత్రం గురించి పలు ఆసక్తి కర విషయాలను తెలియజేశాడు. ఈ చిత్రం కోసం మూడేళ్లు అమెరికాలో ఉండి డెవలప్ చేశాము. ఈ చిత్రంకోసం భారీగానే ఖర్చు పెట్టాం నా మార్కెట్ స్థాయి ని మించి ఈ చిత్రంకోసం ఖర్చు చేశాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రిస్క్ తీసుకుంటాం అనిపించింది అందుకే ఈమేరకు ఖర్చు చేశాం అన్నారు. రిస్క్ తీసుకుంటేనే ఫలితం అనేది వస్తుంది అన్నారు. ఓ అక్క తమ్ముడు కలిసి ముంబయి, గుజరాత్ లలో ఉండి అమెరికా డబ్బును ఏ విదంగా కొట్టేశాము అనేది ప్రదానంగా చూపించాము అన్నారు. మొత్తంగా వారు 4 వేల కోట్లను కొట్టేశారు. ఈ చిత్రంలో అక్క పాత్ర కోసం ముందుగా ప్రీతి జింతా ను అడిగాము. ఈ పాత్ర చేస్తే బయట చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అన్నారు.
అందుకే మరో ఛాన్స్ గా కాజల్ ను కలిసి అడిగితే ఆమె వెంటనే ఈ పాత్రను ఓకే చేసింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీసు పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. నిజానికి ఈ పాత్రను నేను చెయ్యాలిసింది కానీ అనుకోని కారణాల వలన నేను తప్పుకున్నాను.. మొదట ఈ పాత్ర కోసం సునీల్ శెట్టి గారిని సంప్రదిస్తే ఆయన వెంటనే ఓకే చేశారు. ఈ చిత్రంలోని నా పాత్రపై మా నాన్న మోహన్ బాబు గారు, శ్రీను వైట్ల గారు నువ్వేంటి విలన్ పాత్రలో చేశావు అన్నారు కానీ మా అమ్మ నిర్మల గారు నన్ను మెచ్చుకున్నారు. మరో కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం యొక్క విడుదల తేదీని ప్రకటిస్తాం అని మంచు విష్ణు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి గారికి, వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు.